సైకిల్ పై పవన్ కళ్యాణ్... ‘అజ్ఞాతవాసి’ మరో పోస్టర్...

SMTV Desk 2017-12-12 16:42:16  agnathavasi new poster, agnathavasi teaser date, pspk25, pawan kalyan.

హైదరాబాద్, డిసెంబర్ 12: పవర్ స్టార్ అభిమానులను ‘అజ్ఞాతవాసి’ చిత్ర బృందం ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కుతున్న విషయం తెలిసింది. అయితే ఈ రోజు పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ ద్వారా మరో పోస్టర్ ను విడుదల చేశారు. దీనిలో పవన్ సైకిల్ పై బయలుదేరుతున్నట్లు, ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 16న విడుదల చేస్తున్నట్లు అందులో చూపించారు. గతంలో పవర్ మాంత్రికుల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రముఖులలో ఆసక్తి నెలకొంది.