ఈ వీసాకు అరుదైన అవకాశం

SMTV Desk 2017-12-12 15:57:23  EB5 VISA, H1B VISA, Trump, america

వాషింగ్టన్, డిసెంబర్ 12 : యూఎస్ లో స్థిరపడిన వాసులకు ఈబీ5 వీసా తీపికబురు అందించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1-బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో, ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్‌ కు చెందిన కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించింది. ఈ మేరకు అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది అరుదైన అవకాశం. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1-బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారని, విశ్లేషకులు నుంచి అందిన సమాచారం.