ఆయా శాఖాధినేతలతో సీఎం చంద్రబాబు చర్చలు

SMTV Desk 2017-12-12 15:29:35  ap cm chandrababu naidu, amaravathi, meeting

అమరావతి, డిసెంబర్ 12 : నేడు అమరావతిలో ఆయా శాఖాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి త్రైమాసికం నాకు పరీక్ష అని, రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సుకు ఇది సన్నాహక సమావేశం అన్నారు. సాంకేతికతను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకుంటున్నామన్నారు. అలాగే జక్కంపూడి ఎకనామిక్ సిటీ రోల్ మోడల్ ప్రాజెక్టు అని, హౌసింగ్, ఎకనమిక్ సిటీ సంయుక్తంగా ఉంటాయని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, జనవరి 24న రథసప్తమి రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ సూర్యోదయ రాష్ట్రం, సూర్యుడిని ఆరాధించడం అంటే సూర్యశక్తిని మరింత సమర్ధంగా వినియోగించుకునేందుకు సంపూర్ణ దృష్టి పెట్టడమేనన్నారు. ఈ నేపథ్యంలో రథసప్తమి రోజున జరిగే ఉత్సవాల్లో ప్రజలు పెద్దఎత్తున పలు పంచుకోవాలన్నారు.