పోలవరం లెక్కలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో

SMTV Desk 2017-12-12 15:04:10  polavaram Calculate online, ap cm chandrababu, amaravathi

అమరావతి, డిసెంబర్ 12 : రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నేడు ఆయా శాఖధిపతులతో సదస్సులో పాల్గొన్న ఆయన ఈ మేరకు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చుపెట్టిన సొమ్ముతో పాటు పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు అందిన సాయం, పోలవరం పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆయన తెలిపారు.