ముఖ్యమంత్రికే సహాయం అందించిన పార్టీ కార్యకర్త

SMTV Desk 2017-05-28 19:11:47  Andhra Pradesh,Chandrababu,TDP,mahanadu

విశాఖపట్నం, మే 27 : రాజకీయ పార్టీ కార్యకర్తలు అంటే కేవలం పార్టికి సంబంధించిన పనులను చేస్తామని, ప్రజల దగ్గరకు వెళ్లి పార్టీలో సభ్యత్వం పేరుతో విరాళాలను సేకరించి తమ పబ్బాన్ని గడుపుకునే నాయకుల్లున్న ఈ రోజుల్లో, ఒక పార్టీ కార్యకర్త తన వంతు సహాయంగా, ఏకంగా బంగారాన్ని రాష్ట్ర అభివృద్ది కోసం వాడమని ముఖ్యమంత్రికి ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు సభలో జరిగింది. వివరాల్లోకెళ్తే టీడీపి కార్యకర్త ఐన రత్తయ్య, చంద్రబాబు నవ్యాంధ్ర రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు తమ మాటలతో దెప్పి పొడుస్తున్నాయని రత్తయ్య చాలా బాధ పడుతూ తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చంద్రబాబుకు ఇచ్చారు. రాష్ట్ర రాజధాని కొరకు ఖర్చు చేయమని చెప్పడంతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తన కష్టాన్ని చూసి బంగారాన్ని ఇచ్చిన రత్తయ్యను ఎల్లప్పటికి గుర్తు పెట్టుకుంటానని, కొంతమంది సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తారని కాని రత్తయ్య మాత్రం అలా కాకుండా ఒక రకమైన చిత్తశుద్ధితో పని చేస్తున్నాడని ఆయన భావించారు.