పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

SMTV Desk 2017-12-12 12:25:44  polavaram project, cm chandrababu naidu, amaravathi

అమరావతి, డిసెంబర్ 12 : ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. పోలవరం నిర్మాణమే జీవిత లక్ష్యంగా దీనిపై అత్యంత శ్రద్ధ పెడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన ఆయన, నూతన భూసేకరణ చట్టం వలనే పోలవరంలో అంచనాలు భారీగా పెరిగాయని తెలిపారు. ఈ మేరకు ప్రతి సోమవారం సమాచారం వెల్లడిస్తున్నామని, అసెంబ్లీ ముందు అన్ని అంశాలు ఉంచినా, ఇంకా శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. త్వరలోనే డయఫం వాల్, దిగువ కాఫర్ డ్యాం పనులు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. కాగా, ఈ నెల 22న కేంద్రశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రానున్న విషయం తెలిసిందే.