ఏసీబీ వలలో చిక్కిన ఉన్నతోద్యోగి

SMTV Desk 2017-12-12 11:10:23  ACB, Divisional Department Regional Joint Commissioner Chandrashekhar Azad,

విజయవాడ, డిసెంబర్ 12 : పేదరికాన్ని నిర్మూలించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే సహకరిచకుండా అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ సోదాలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సోదాల్లో దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ పట్టుపడ్డాడు. ఈయన ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో విజయవాడ, రాజమహేంద్రవరంలోని చంద్రశేఖర్‌ నివాసాల్లో విసృత్త తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ యనమలకుదురులోని చంద్రశేఖర్‌ సోదరుడు వివేకానంద నివాసంలోనూ, ఏలూరు, హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలో గల అపార్ట్‌మెంట్‌లోనూ, అనంతపురం జిల్లా వూబిచర్ల, కృష్ణా జిల్లా నూజివీడులోనూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భారీస్థాయిలో అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల్లో 16 చోట్ల 21 బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. ప్రస్తుతం ఆయన సోదరుడు వివేకానంద ఇంట్లో చర, స్థిరాస్తి, బంగారు ఆభరణాలను గుర్తించారు. విజయవాడ దేవాదాయశాఖలో ఆర్జేసీగా పని చేస్తున్న చంద్ర శేఖర్ ఆజాద్ సోదరుడు విజకనంద ఇంటిపై అవినీతి శాఖ అధికారులు సోదాలు. * భారీగా బయటపడిన నగదు,ఆభరణాలు, స్ట్రస్టీకి సంబందించిన పత్రాలు. * రాష్ట్రవ్యాప్తంగా 16 చోట్ల 21బృందాలు గలింపులు. * ఆదాయానికి మించిన ఆస్తుల కలిగిఉన్నాయని ఆరోపణలతో ఐటీ అధికారుల దాడులు. * రాజమండ్రిలో ఆర్జేసీగా పనిచేస్తున్న చంద్రశేఖేర్ ఆజాద్.