ఆదివారాలు తరగతులను నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు..!

SMTV Desk 2017-12-11 18:00:37  Deputy CM china rajappa, sports, scholls matter, state government.

ఒంగోలు, డిసెంబర్ 11 : ఒంగోలులోని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. క్రికెట్‌, టెన్నిస్‌ ఆటలకు మంచి ఆదరణ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు చేస్తోంది" అంటూ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత, అలాగే ఆదివారం ప్రత్యేక తరగతుల౦టూ నిర్వహిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు తప్పవంటూ హెచ్చరించారు.