ఫేస్ బుక్ లో ఫోటోలు మార్ఫింగ్.. కేసు నమోదు..

SMTV Desk 2017-12-11 17:55:04  facebook photos morphing, facebook, krishna,

పెనములురు, డిసెంబర్ 11: కొంత మంది ఆకతాయిలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తామంటూ ఆడపిల్లలకు ఫోన్ చేస్తూ, మెసేజ్ లు పెడుతూ మానసిక హింసకు గురి చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పోరంకికి చెందిన వివాహిత తమ కుటుంబసభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో ఉంచారు. నాలుగు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తి, అసభ్యంగా మాట్లాడటం, మెసేజ్‌లు పెట్టడం మొదలు పెట్టి, ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి నీలిచిత్రాల వెబ్‌సైట్‌లో పెట్టడం ప్రారంభించాడు. అంతేకాదు ఆ అసభ్య ఫొటోలను ఆమె వాట్సప్‌కు పంపించాడు. ఇక ఆ వివాహిత వారి కుటుంబ సభ్యులకు అసలు విషయాన్నీ వివరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.