అయిదేళ్లలో అధిక విక్రయలే లక్ష్యం...

SMTV Desk 2017-12-11 14:50:35  hero electric plat, director naveen munjal, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ద్విచక్ర వాహనాల విక్రయాలు రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు ప్రస్తుత స్థాయికి 10 రెట్లు అధికం చేయాలన్న లక్ష్యంతో ఉన్న హీరో ఎలక్ట్రిక్‌, మరిన్ని ప్లాంట్లు నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం లుధియానాలోని ప్లాంటు ద్వారా ఏడాదికి 50,000 వాహనాలు తయారు చేసే సామర్థ్యం సంస్థకు ఉంది. ఈ సందర్బంగా హీరో ఎలక్ట్రిక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ ముంజాల్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది అన్ని కంపెనీలు కలిపి ఈ విభాగంలో 32,000-35,000 వాహనాలు విక్రయిస్తామని, వచ్చే ఏడాది మూడురెట్లు అధికంగా, అయిదేళ్ల వ్యవధిలో ఏడాదికి 2,50,000 వాహనాలకు పైగా విక్రయించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ఇందుకోసం కొత్త ప్లాంట్లు అవసరమని, వీటికి ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించేందుకు వచ్చే వారం కంపెనీ యాజమాన్యం సమావేశం అవుతుందన్నారు. ఎగుమతులకు దేశ పశ్చిమ దక్షిణ ప్రాంతాల్లో కొత్త ప్లాంట్లను నెలకొల్పి ఇ-రిక్షాలు కూడా తయారు చేస్తామని తెలిపారు.