32వ రోజు జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం...

SMTV Desk 2017-12-11 10:41:14  jagan paadayathra updates, jagan, ysrcp, anantapoor

అనంతపురం, డిసెంబర్ 11: అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంక్పలయాత్ర సోమవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు నుంచి ఆరంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలి రాగా వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి 10.00 గంటలకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకున్నారు. ప్రజాసమస్యలు వింటూ సాగుతున్న పాదయాత్రలో జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మద్యాహ్నం 3 గంటలకు లంచ్‌ క్యాంప్‌ నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్‌ జగన్‌ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.