అభిమానికి షాక్ ఇచ్చిన షారుఖ్...

SMTV Desk 2017-12-10 18:24:05  hero sharukh khan, twitter, Bollywood.

ముంబై, డిసెంబర్ 10 : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్ అభిమానులతో సరదాగా ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ షారుఖ్ మరో ప్రశ్న వేశారు. ఇంతకీ విషయమేమిటంటే.. చిరాగ్‌ అనే వ్యక్తి షారుఖ్ కి ట్వీట్‌ చేస్తూ "షారుఖ్ సర్ మీ నంబర్ ఇవ్వరా..? అని అడిగాడు. దానికి సమాధానంగా షారుఖ్.. "త్వరలో తప్పకుండా పంపిస్తాను. ఇంకా నా ఆధార్ కార్డు నంబర్ కూడా కావాలా..? అంటూ రీట్వీట్‌ చేశారు. దీంతో ఆ అభిమాని "ఓ మై గాడ్. థ్యాంక్యూ సర్‌. మీ నుంచి వచ్చిన రిప్లై చాలు" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇంకేముంది ఇలా రిప్లై ఇచ్చాడో లేదో అలా 300 పైగా రీట్వీట్లు, వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం షారుఖ్.. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.