విశాఖలో నాగార్జున సందడి

SMTV Desk 2017-12-10 17:19:32  south india shopping mall, vishakhapatnam, hero nagarjuna

విశాఖపట్నం, డిసెంబర్ 10 : విశాఖపట్నంలోని సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ కు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున విచ్చేసి సందడి చేశారు. జగదాంబ కూడలిలో సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తనయుడు అఖిల్‌తో హాజరైన నాగార్జున అభిమానుల కేరింతల మధ్యలో ఉత్సాహంగా జ్యోతి ప్రజ్వలన చేసి భారీ కేకును కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అభిమానులు అంతా బాగున్నారా.. మీరు బాగుంటే నేను బాగుంటాను అని అన్నారు. అనంతరం షాపింగ్‌మాల్‌లోని వస్త్ర శ్రేణులను తిలకించారు. షాపింగ్ మాల్ సమీపం వద్ద అభిమానులు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తులో తరలి వచ్చారు.