22న పోలవరాన్ని సందర్శించనున్న నితిన్ గడ్కరీ

SMTV Desk 2017-12-10 16:01:22   Polavaram Project, Union Minister Nitin Gadkari, amaravathi

అమరావతి, డిసెంబర్ 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఈ నెల 22న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సందర్శించడానికి రానున్నారు. అలాగే, ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు 22వ సారి పోలవరంను పరిశీలించడానికి వెళ్లనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అలాగే పోలవరాన్ని అడ్డుకోవాలని కొందరు విపక్షాలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే పోలవరంపై అన్ని అంశాలు అసెంబ్లీ ముందు ఉంచామన్నారు.