రాజమౌళి బయోపిక్ సినిమానా..!

SMTV Desk 2017-12-10 15:44:53  rajamouli, ntr, ram charan,

హైదరాబాద్, డిసెంబర్ 10: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించే సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల నుండి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా క్రీడా నేపథ్యంలో రాజమౌళి సినిమాను తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో చరణ్‌, తారక్‌ బాక్సర్లుగా నటిస్తున్నారట. అంతేకాదు ఓ కుటుంబ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని తాజా సమాచార౦. ఇది బయోపిక్ సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సినీ వర్గాలలో టాక్. అదే నిజమైతే అది ఎవరి కుటుంబం, ఎవరి బయోపిక్ గురించి అన్నది తెలియాల్సి ఉంది.