విజయ్ ఫోటోల వెనుక రహస్యం ఇదే...

SMTV Desk 2017-12-10 15:13:41  vijayadevarakonda, mehareen, telugu mahasabhalu, vamshi paidipalli,

హైదరాబాద్, డిసెంబర్ 10: నటుడు విజయ దేవరకొండ రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోల గురించి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అదేంటంటే... ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం, ప్రముఖ దర్శకులు హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి కలిసి ఓ ప్రత్యేక పాటను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌, ఈషా రెబ్బా తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో మెహరీన్‌, వంశీ పైడిపల్లి, యూనిట్‌ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను విజయ్‌,మెహరీన్‌ అభిమానులతో పంచుకున్నారు. మొత్తానికి తెలుగు మహాసభలలో అలరించడానికి సినిపరిశ్రమలోని దర్శకులు నటులు, నటీమణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.