నూతన ఏడాదిలో నిరుద్యోగ సమస్యలపై కసరత్తు

SMTV Desk 2017-12-10 13:24:24  AP CM Chandrababu naidu, Unemployment benefit, amaravathi

అమరావతి, డిసెంబర్ 10 : ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే యువజనోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువ సాధికార నిరుద్యోగ భృతికి ఒక రూపం తీసుకురానున్నారు. ఆర్థిక, యువజన సేవలు, పంచాయతీరాజ్‌, ఐటీ, రవాణ, కార్మిక-ఉపాధికల్పన, వ్యవసాయం, విద్య, పశుసంవర్థక శాఖల మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, నిరుద్యోగభృతి అమలు శాఖ ముఖ్యకార్యదర్శి సభ్య సమన్వయకర్తగా ఉంటారు. జిల్లాల్లో కలెక్టర్‌ ఛైర్మన్‌గా కార్యక్రమ అమలు కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ జిల్లాలో శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తుంది. ప్రస్తుతానికి ఒక్కో నిరుద్యోగికి రూ.వేయి భృతినందించాలని ప్రతిపాదన ఉంది. సుమారు 10లక్షల మంది నిరుద్యోగులుంటారని అంచనా వేస్తున్నా తాజాగా రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ఏడాదికి రూ.600 కోట్ల నిధులు అవసరమని భావిస్తున్నారు.