ట్రెసా అధ్యక్షుడిగా మఠం శివశంకర్‌ ఏకగ్రీవ ఎన్నిక...

SMTV Desk 2017-12-10 13:12:40  Telangana Revenue Employees Services Association, matam Sivasankar President

హైదరాబాద్, డిసెంబర్ 10 : ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్) అధ్యక్షుడిగా మఠం శివశంకర్‌ నియమితులయ్యారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నారాయణరెడ్డి(సీసీఎల్‌ఏ), అసోసియేట్‌ అధ్యక్షుడిగా కె.సుధాకర్‌రావు(నిజామాబాద్‌), కోశాధికారిగా బి.వెంకటేశ్వర్‌రావు లు ఎన్నికయ్యారు. మఠం శివశంకర్‌ ను మూడేళ్ల కాలానికి గాను సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.