రాష్ట్రపతి పోటీకి శ్రీధరన్ ..?

SMTV Desk 2017-06-16 12:34:01  bjp, president, elections, sreedharan, amith shah, venkaiah naidu, chandrababu, sharad pawar

హైదరాబాద్, జూన్ 16: రానున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్ డీఏ తరుపున ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ విషయం ఎంత వరకు నిజం అని కొందరు పార్టీ నేతలు ఆరాలు తీస్తున్నారు. ఒకవేళ రాజకీయేతర వ్యక్తినే ఎంచుకోవాల్సి వస్తే శ్రీధరన్ పేరును బీజేపీ పరిశీలించొచ్చన్నది సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ముందుగా వెల్లడించేది లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ తోనూ ఈ రోజే భేటి కానున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోనూ సమావేశమై ప్రతిపక్షం అభిప్రాయం ఏంటన్నది తెలుసుకోనున్నారు. ప్రతిపక్షానికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవాలని, అందరి ఆమోదంతో రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుందని, వారు కుట్రలు పన్నిన బిజెపికి నెగ్గుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.