ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు...

SMTV Desk 2017-12-10 11:31:18  Congress President Sonia Gandhi, Birthday celebrations,

న్యూఢిల్లీ, డిసెంబర్ 10 : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సహా సోనియా నివాసం వద్ద పార్టీ కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ "సోనియా మీరెప్పుడు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా" అని ట్వీట్‌ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శులు, పలు రాష్ట్రాల మాజీ సీఎంలు ఉన్నారు.