రోజు రోజు కి వేడెక్కుతున్న కర్నూలు రాజకీయాలు

SMTV Desk 2017-06-16 11:51:41  Kurnool,Bhooma Akhilapriya,YSRCP,TDP counsilors

కర్నూలు, జూన్ 16 : కర్నూలు జిల్లా రాజకీయాలు రోజురోజుకి వేడుక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ లో మంత్రి భూమా అఖిలప్రియ వివాదాస్పదంగా మారుతున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెదేపాను వదిలి వైకాపా లో చేరడానికి కారణం అఖిలప్రియ అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఇలాంటి పరిణామమే మరొకటి మొదలైంది. అఖిలప్రియతో ఆర్ఐసీ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్లతో ఆయన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీరంతా అఖిల వైపు ఉంటారో లేక తన వైపు ఉంటారో తేల్చుకోవాలంటూ కౌన్సిలర్లను ఆయన ప్రశ్నించారు. నంద్యాలలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో తనను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ ఛార్జ్ మంత్రులు సుజనా, కాల్వ శ్రీనివాసులు ఆయనకు ఫోన్ చేయగ, వారి ఆదేశాల మేరకు హుటాహుటిన విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.