రొమ్ము క్యాన్సర్ కు కారణమవుతున్న మాత్రలు...

SMTV Desk 2017-12-09 14:26:49  Breast cancer, tablets, Copenhagen University chapters in Denmark, Landon

లండన్‌, డిసెంబరు 8: ఇటీవలి కాలంలో రొమ్ము కేన్సర్‌ తో బాధ పడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ సమస్య గర్భ నిరోధక మాత్రలతో ముంచుకొస్తుందని డెన్మార్క్‌లోని కోపెన్‌హగ్‌ వర్సిటీ అధ్యాయకులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 18 లక్షల మంది మహిళలపై పదేళ్ల పాటు పరిశోధన చేయగా, ఈ మాత్రలు వాడని వారితో పోలిస్తే ఐదేళ్లు, ఆపైన మాత్రలు వాడిన వారిలో రొమ్ము కేన్సర్‌ ముప్పు స్వల్పంగా పెరిగిందని వారు తెలిపారు. ప్రతి లక్ష మంది మహిళల్లో 13 మంది ఈ వ్యాధి ;బారిన పడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.