రైలులో బోజన౦పై రూ.100 డిస్కౌంట్‌ కూపన్..

SMTV Desk 2017-12-09 12:42:12  railway food, railway officers, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రైలులో దూరభారం వెళ్ళే ప్రయాణికులకు ఈ-కేటరింగ్‌ సర్వీసుల ద్వారా ఫుడ్‌ డెలివరీ సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఫుడ్‌ డెలివరీ అందడం లేదని, ఒకవేళ అందినా కూడా ఆ ఫుడ్‌ సరిగ్గా లేదనే సమస్యలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై రైల్వే అధికారులు స్పందించి ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించినందుకు క్షమాపణ చెప్పడం ఒక్కటే సరిపోదని, నష్టపరిహారం కింద రూ.100 డిస్కౌంట్‌ కూపన్‌ను రైల్వే ప్రయాణికులు కేటరర్‌ నుంచి పొందవచ్చని తెలిపింది. జూలై నుంచి దేశీయ రైల్వే ఈ రూ.100 డిస్కౌంట్‌ కూపన్‌ను నష్టపరిహారం కింద అందిస్తుంది. ఇప్పటి వరకు రైల్వేలు 3154 మంది ప్రయాణికులకు ఈ కూపన్లు ఆఫర్‌ అందించింది.