ఆసక్తికరంగా ఉన్న రాహుల్ గాంధీ ఫోటో..!

SMTV Desk 2017-12-08 18:34:59  rahul gandhi, editing photo viral, cricketer, former minister mani shankar ayyar.

న్యూఢిల్లీ, డిసెంబర్ 08 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. విషయమేమిటంటే.. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్‌ అయ్యర్.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం విదితమే. అయితే ఈ విషయంపై స్పందించిన రాహుల్, మణి శంకర్‌ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించగా రాహుల్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ నేత హసీబ్‌ అహ్మద్‌ రాహుల్ గురించి ఓ పోస్టర్ తయారు చేశారు. అందులో రాహుల్ క్రికెటర్ గా బ్యాట్ పట్టుకొని బాల్‌ను కొడుతున్నట్లు అందులో చూపించారు. బాల్ రూపంలో అయ్యర్ ఉన్నారు. ఈ ఫొటోపై "వెల్‌ డన్‌ రాహుల్‌ భయ్యా" అని రాసి ఉంది. ఈ ఫోటోపై నెటిజన్ల నుండి విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి.