హిమాలయ అందాలలో చిన్న చీమలా ఉన్నా...

SMTV Desk 2017-12-08 18:27:33  india coach ravishastri, darmashala, himalayas,

ధర్మశాల, డిసెంబర్ 8: హిమాలయ అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగల సామర్ధ్యం ఉంటుంది. అక్కడి ప్రకృతి మైమరిపించే విధంగా పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంటుంది. తాజాగా భారత కోచ్‌ రవిశాస్త్రి తన ట్విట్టర్ వేదికగా... హిమాలయ అందాలు తనను కట్టిపడేశాయి అంటూ, అందులో తాను చిన్న చీమలా ఉన్నానంటూ ట్విట్ చేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెట్ కు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. ధర్మశాల వేదికగా భారత్‌-శ్రీలంకల మధ్య మొదటి వన్డే మ్యాచ్‌ జరగబోతున్న సంగతి తెలిసిందే.