ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ పాదయాత్ర...

SMTV Desk 2017-12-08 17:22:30  apcc cheaf raghuveera reddy, padayatra, polavaram project.

అమరావతి, డిసెంబర్ 08 : ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని వచ్చే నూతన సంవత్సరం ప్రారంభంలో 7 నుంచి 9 వ తేదీ వరకు పాదయాత్ర చేయనున్నట్టు పేర్కొన్నారు. 7వ తేదీ రోజున ధవళేశ్వర్ లోని సర్ అర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం విషయ౦పై కేంద్రం నుండి హామీని పొందాలని టీడీపీకి సూచించారు. కాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఈ యాత్రను నిర్వహించనున్నారు.