నగరంలో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం

SMTV Desk 2017-12-08 16:50:16  TDP Politburo meeting, attended ap cm chandrababu, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 08 ‌: నేడు నగరంలో తెదేపా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం నిర్వహిచింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన ఈ భేటికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్దకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన రాకతో తెదేపా కార్యకర్తలు భారీగా అక్కడికి తరిలివచ్చారు.