ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా రాహుల్: లాలూ

SMTV Desk 2017-12-08 16:50:01  lalu, rjd, opposition, rahul, pm candidate

న్యూ డిల్లీ, డిసెంబర్ 08: జాతీయ కాంగ్రెస్ కు కాబోయే అధ్యక్షుడు రాహుల్ గా౦ధీ ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నిలబడతారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. మోదీ, ఎన్డీఏకు సరైన ప్రత్యామ్నాయం రాహులే అని ఆయన ఉద్ఘాటించారు. మత తత్వ భావాలు గల బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత లౌకిక ధర్మానికి దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, రాహుల్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒక్కటై వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ ను మట్టికరిపించాలని ఆయన సూచించారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ నాయకత్వం దేశానికి అవసరమని లాలూ వివరించారు.