బెంగళూరులో ముగ్గురు పాకిస్తానీలు అరెస్ట్‌

SMTV Desk 2017-05-28 19:08:00  pakisthanis, arrest, bengalour,india

బెంగళూర్, మే 27 : బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు పాకిస్తాన్‌ పౌరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారితో పాటు వారికి సహకరిస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముగ్గురు మారుపేర్లతో ఆధార్, ఓటర్‌ కార్డులు పొందడం గమనార్హం.వీరు నేపాల్‌ రాజధాని ఖట్మండూ మీదుగా బీహార్‌లోని పాట్నాకు చేరి బెంగుళూరు వచ్చినట్లు తెలుస్తుంది.