పవన్‌ కల్యాణ్‌ పై లోకేశ్ వ్యాఖ్యలు

SMTV Desk 2017-12-08 15:28:38  naralokesh, pavankalyan, media, amaravathi

అమరావతి, డిసెంబర్ 08 : నేడు తన కుటుంబ ఆస్తులు ప్రకటించిన నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ... జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పై వ్యాఖ్యలు చేశారు. నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలోకి వస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. వారసులుగా మేం సమర్థంగా పనిచేయకుంటే రాజకీయాల్లో నిలబడలేమని ఆయన అన్నారు. వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తవమే కానీ, ప్రజాధారణ ఉంటేనే నిలబడగలమన్నారు. పవన్‌కల్యాణ్‌ పోలవరం పూర్తి కావాలని మాట్లాడారని, వైసీపీ నేతలు పోలవరం పూర్తి కావొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. కాపులను బీసీల్లో చేర్చడం, వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడం వంటి కీలక నిర్ణయాల్లో ప్రతిపక్షం అసెంబ్లీకి హాజరుకాలేదని ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల పెంపు అంశం చట్టంలోనే ఉందని లోకేశ్ అన్నారు.