నోట్లరద్దు అపరిపక్వ నిర్ణయం: మన్మోహన్

SMTV Desk 2017-12-08 15:04:31  manmohan singh, demonitisation, criticism, modi

న్యూ డిల్లీ, డిసెంబర్ 08: తొలి నుంచి పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వచ్చిన ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి స్పందించారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం నల్లధనంపై తీసుకున్న అపరిపక్వ చర్య అని విమర్శించారు. సాహసోపేత నిర్ణయానికి, విపత్కర నిర్ణయానికి చాలా తేడా ఉందని ఇది ఆర్దిక వ్యవస్థపై ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకున్న వినాశకర నిర్ణయమని ఆయన ఆరోపించారు. దీనివల్ల నల్లధనం బయటకు రాకపోగా ఉన్నధనం బ్యాంకు లకు పోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అనేక ఉద్యోగాలు పోయి, కొత్త ఉద్యోగాలు లేక ప్రజలు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని ఆయన పేర్కొన్నారు. అవినీతి, నల్లధనాన్ని రూపుమాపడానికి ఎన్డీఏ చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.