మంత్రి దేవినేనికి సీఎం చంద్రబాబు ఆదేశం

SMTV Desk 2017-12-08 14:25:40  AP CM Chandrababu naidu, Irrigation Minister Devineni Uma, polavaram project, vishakhapatnam

విశాఖపట్నం, డిసెంబర్ 08 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖలో పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలవరానికి కేంద్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వివరాలను వివరిస్తున్నామని తెలిపారు. అలాగే, రాష్ట్రం పెడుతున్న ఖర్చును ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నమన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చేసే కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మంత్రులకు అందజేయాలని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను సీఎం ఆదేశించారు. కాగా, అసెంబ్లీలో పోలవరంపై చేసిన ప్రకటనే శ్వేతపత్రంతో సమానమని వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించుకుంటున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, వైకాపాలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.