నేడు ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై శ్వేతసౌధం నివేదిక

SMTV Desk 2017-12-08 11:38:47  america, Donald Trump as President, 2nd year, heath checkup

వాషింగ్టన్‌, డిసెంబర్ 08 : అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్, ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 7న జరిగిన జెరూసలెం ప్రకటన సందర్భంగా ‘గాడ్‌ బ్లెస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌’ అనాల్సిన ట్రంప్, ‘గాడ్‌ బ్లెష్‌ యునైటెడ్‌ ష్టేట్స్‌’ అని ట్రంప్ తడబడటంతో, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే, అవన్నీ హాస్యాస్పదమైనవే. అధ్యక్షుడి గొంతు ఎండిపోయింది. అందుకే అలా మాట్లాడారు. అంతకంటే ఇంకేం లేదని, శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ సారా అన్నారు. జెరూసలెం ప్రకటన సందర్భంగా దాదాపు ప్రసంగం మొత్తం ఆయన ఇలాగే తడబడటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వ్యాపించడం జరిగింది. ఇక పదవిలో భాగంగా ఆయన రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతునందున, ప్రొటోకాల్‌ ప్రకారం.. ఆయనకు వైద్యపరీక్షలు చేయనున్నారు. ఈ మేరకు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై శ్వేతసౌధం నేడు నివేదిక వెల్లడించనుందట.