ఆయన మరణ వార్త విని చాలా బాధపడ్డా : సోనియా గాంధీ

SMTV Desk 2017-12-07 17:11:04  Soniya gandhi, letter to shashikapoor daughter, sanjana kapoor.

న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : బాలీవుడ్ నటుడు శశికపూర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శశికపూర్ కుమార్తె సంజనా కపూర్ కి లేఖ రాశారు. ఆ లేఖలో శశికపూర్ నటించిన "షేక్ స్పియర్ వాలా" సినిమా చూసి ఆయనకు అభిమానిగా మారానని, ఆ అనుభూతిని ఎప్పటికి మర్చిపోలేనని పేర్కొన్నారు. ఆయన మరణ వార్త విని చాలా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.