ఇదేనా మహిళా సాధికారత: రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

SMTV Desk 2017-12-07 16:58:40  supreem court, wrath, states, women welfare

న్యూ డిల్లీ, డిసెంబర్ 07: మహిళా సాధికారత, సంక్షేమం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పినంత మాత్రాన ఉపయోగం ఉండదని, చిత్తశుద్ది, సంకల్పం అవసరమని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ రాసిన లేఖపై రాష్ట్రాలు స్పందించక పోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం రాసిన లేఖపై స్పందించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారులకు 5 నిమిషాల సమయం దొరకట్లేదా? అని ప్రశ్నించింది. మహిళల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి రాసిన లేఖపై గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పందన తెలకపోవడంతో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించి, అసంపూర్తిగా స్పందన పంపిన రాష్ట్రాలను. 4 వారాల్లోగా రూ.లక్ష చొప్పున సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీలో జమ చేయాలని ఆదేశించింది. మహిళల సంక్షేమంపై ఏమాత్రం పట్టింపు ఉన్నా కేంద్ర కార్యదర్శి కోరిన వివరాలను 3 వారాల్లోగా అందజేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది.