కోహ్లీ పెళ్ళికి కోచ్ సెలవు...?

SMTV Desk 2017-12-07 16:57:01  virat kohli, coach rajkumar sharma, cricket

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నిన్నటిదాకా విరాట్-అనుష్కల వివాహం అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. తాజాగా విరాట్ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ తనకు సెలవు కావాలంటూ ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)ను సంప్రదించారట. దీనికి డీడీసీఏ అనుమతి కూడా ఇవ్వటంతో పలు అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. దీంతో సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా శుక్రవారం దిల్లీ సెమీఫైనల్లో తమిళనాడుతో జరగనున్న పోటికి జూనియర్‌ రాబిన్‌ సింగ్‌ను కోచ్‌గా నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన అండర్‌-23 దిల్లీ జట్టుకు కోచ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. విరాట్ కోచ్ ఈ ప్రేమ జంట పెళ్లికై సెలవు పెట్టాడంటూ నెట్టింట్లో వార్త షికారు చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలి మరి.