ఉద్యోగం చేయడానికి నె౦1 ప్లేస్.. ఫేస్ బుక్..

SMTV Desk 2017-12-07 15:36:42  FACE BOOK, 100 BEST PALCES TO WORK IN THE US, APPLE,

అమెరికా, డిసెంబర్ 7: ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాలలో పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అందులో సోషల్ మీడియా దిగ్గజ ఫేస్ బుక్ లో ఉద్యోగం అంటే అందరూ పరుగులు తీస్తారు. ప్రస్తుతం అమెరికాలో పనిచేయడానికి ఫేస్‌బుక్‌ ముందంజలో ఉందని గ్లాస్‌డోర్‌ ప్రకటించింది. "100 బెస్ట్‌ ప్లేసెస్‌ టూ వర్క్‌ ఇన్‌ ది యూఎస్‌' పేరుతో ఉద్యోగ వెబ్‌సైట్‌ గ్లాస్‌డోర్‌ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఉద్యోగులు పనిచేయడానికి ఉన్నతమైన ప్లేస్‌లో ఫేస్‌బుక్‌ చోటు దక్కించుకుంది. అనంతరం గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ ఉండగా బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇన్‌-అండ్‌-అవుట్‌ బర్గర్‌, గూగుల్‌లు చివరగా ఉన్నాయి. అంతేకాదు ఈ సందర్బంగా గ్లాస్‌డోర్‌ మరో విషయాన్ని వెల్లడించింది. కూపర్టినోకి చెందిన టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన ర్యాంకును కోల్పోగా, గతేడాది 36వ స్థానంలో నిలిచిన ఆపిల్‌, ఈ ఏడాది 84వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. ఎస్‌ఏపీ 11వ స్థానం, సేల్స్‌ఫోర్స్‌ 15వ స్థానం, లింక్‌డిన్‌ 21వ స్థానం, అడోబ్‌ 31వ స్థానం, మైక్రోసాఫ్ట్‌ 39వ స్థానం, స్పేస్‌ఎక్స్‌ 50వ స్థానాన్ని దక్కించుకున్నాయి.