రూ. 50, రూ. 200 నోట్లను మార్చండి : హైకోర్టు

SMTV Desk 2017-12-07 12:05:31  delhi high court, new notes issue, rbi, central govt

న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : ఢిల్లీ హైకోర్టు... ఆర్బీఐ, కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఇటీవల విడుదల చేసిన రూ. 50, రూ. 200 నోట్లు వర్ణ అ౦ధత్వం వారు గుర్తించేందుకు అనుకూలంగా లేవని, ఈ నోట్ల రంగు మరింత కనిపించేలా పలు మార్పులు చేయాలని హైకోర్టు సూచించింది. దీ౦తో పాటు ఆ నోట్లపై ఉన్న గుర్తింపు చిహ్నాలను కూడా సులువుగా గుర్తించేలా నోట్లను తయారు చేయాలని పేర్కొంది. ఆర్బీఐ ఈ విషయాలను గమనించడంలో నిర్లక్ష్యం వహించిందని అభిప్రాయపడ్డ కోర్టు.. ఈ కేసును జనవరి 31కి వాయిదా వేసింది.