భూపాలపల్లి చేరుకున్న కేసీఆర్...

SMTV Desk 2017-12-07 11:21:39  KCR reached bhupalpalli, Karimnagar tour, second day

భుపాలపల్లి, డిసెంబర్ 07 : మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన కరీంనగర్ నుండి ప్రత్యేక విమానంలో భుపాలపల్లి, తుపాకుల గూడెంకు చేరుకొని అధికారులతో మాట్లాడారు. నేడు మేడిగడ్డ బ్యారేజ్ సహా కన్నేపల్లి, సిరిపురం, సుందిళ్ళ పనులను పరిశీలించనున్నారు. చివరి రోజు అనగా రేపు మేడారం పంప్ హౌస్ పనులు, రాంపూర్ పంప్ హౌస్ పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కరీంనగర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.