తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ మృతి

SMTV Desk 2017-12-06 15:50:50  Aadithyan, passed away, tamil music director, chennai

హైదరాబాద్, డిసెంబర్ 06 : ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్‌(63) హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భాగ్యనగరంలో ఉంటున్న తన కుమార్తెను చూడడానికి వచ్చిన ఆయన అనారోగ్యంతో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చగా, పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈయన ఏప్రిల్ 09 1954 న చెన్నైలో జన్మించారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళ చిత్రాల్లో కూడా చాలా సినిమాలకు సంగీతం అందించారు. అంతే కాకుండా చెన్నై స్థానిక టీవీలో ఎనిమిదేళ్లపాటు ఆదిత్యన్‌ కిచెన్‌ పేరుతో వంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రేపు (డిసెంబర్‌7) చెన్నైలో ఆదిత్యన్‌ అంత్యక్రియలు నిర‍్వహించనున్నారు. ఇతని మృతి పై తమిళ చిత్ర పరిశ్రమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.