త్వరలో ఆఫ్గాన్‌ మహిళ సైన్యానికి భారత్ లో శిక్షణ

SMTV Desk 2017-12-06 15:00:10  Aphganisthan, india, army, training

చెన్నై, డిసెంబర్ 06 : త్వరలో అఫ్గానిస్థాన్‌ కి చెందిన మహిళా సైన్యలకు తొలిసారిగా భారత ఆర్మీ, వారికి శిక్షణ ఇవ్వనుంది. మహిళా సైనికులకు భౌతిక శిక్షణతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు అఫ్గాన్‌కు భారత రాయబారి మన్‌ప్రీత్‌ వోహ్రా పేర్కొన్నారు. ఇప్పటికే 4వేల మంది ఆఫ్గాన్‌ మిలిటరీ, పోలీస్‌ సిబ్బందికి భారత సైన్యం శిక్షణ ఇచ్చింది. అయితే, మహిళా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఇదే ప్రధమం. తాలిబన్‌ నుంచి విముక్తి పొందిన నాటి నుంచి అఫ్గాన్‌కు భారత్‌ అన్ని విధాలుగా సహాయసహకరాలుగా ఉంటుంది. దీంతో ఈసారి చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో త్వరలోనే ఆ మహిళా బృందానికి శిక్షణ ఇవ్వనున్నారు.