సంచలన వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పటేల్...

SMTV Desk 2017-12-06 14:53:44  paas party convener harthik patel, comments on BJP.

గుజరాత్, డిసెంబర్ 06 : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఒకరిపై ఒకరు తారాస్థాయిలో విమర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టిదార్ అనామత్ ఆందోళన సమితి(పాస్) పార్టీ కన్వీనర్ హార్దిక్ పటేల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు సంబంధించి అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయని ప్రస్తావించారు. ఆ వీడియో నకిలీదని, మార్ఫింగ్ చేసి ఎవరో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. నాకు ఓ పది కోట్ల రూపాయలు ఇస్తే.. మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అశ్లీల సీడీలను విడుదల చేస్తానని, కంప్యూటర్ లో గ్రాఫిక్స్ చేసి వీడియోలను చూపించడం కష్టమైన పనేమీ కాదని ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుందంటూ ఆరోపించారు.