ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివే వారికి గ్రేడింగ్ విధానం

SMTV Desk 2017-12-06 12:38:09  AP Inter first year student, Grading method, amaravathi

అమరావతి, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్ధుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఓ నిర్ణయంతో ముందుకు వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్ధులకు ఇకపై మార్కుల స్థానంలో మెమోలో సబ్జెక్టు వారీగా గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. వచ్చే ఏడాది జరిగే పరీక్షలలో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. సైన్సు గ్రూపుల వారికి సైతం 100 మార్కులు ప్రాతిపదికగా తీసుకొని, విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఈ గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. అయితే, ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదివే వారికి మాత్రమే ఈ గ్రేడ్లు ప్రవేశపెట్టారు.