ఎల్జీ అధ్యక్షుడు తో సమావేశమైన సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-06 11:29:25  AP CM Chandrababu naidu, LG President Soon Quon meeting

విజయవాడ, డిసెంబర్ 06 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో పర్యటనలో భాగంగా దక్షిణకొరియాలో ఉన్న ఎల్జీ అధ్యక్షుడు సూన్‌ క్వోన్‌ తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన క్వోన్‌ పెట్టుబడులకు గల అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌, ఓఎల్‌ఈడీ, ఎల్‌ఈడీ, స్కీన్స్‌ వంటి డిస్‌ప్లే సిస్టమ్‌ తయారీ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్‌జీ ని ఏపీలో పెద్ద పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. కాగా, వ్యాపారానుకూల రాష్ట్రంలో తాము అగ్రస్థానాల్లో ఉన్నామని దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపు వృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. కొరియా సంస్థ కియా మోటార్స్ రాష్ట్రంలో స్థిరపడిన విధానం, ఫాక్స్‌కాన్‌ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13వేల మందికి ఉపాధి కల్పిస్తున్న వైనాన్ని ఎల్జీ ప్రెసిడెంట్‌కు వివచించారు. అనంతరం మలేషియాలో సౌర విద్యుత్ కార్యకలపాలు సాగిస్తున్న ఓసీఐ సీఈవో ఉహ్ ఉమ్ లీ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.