జూన్ 01 నాటికి మెట్రో పనులు పూర్తి : కేటీఆర్

SMTV Desk 2017-12-06 10:32:27  KTR, metro trains, construction issue, june 1 dead line.

హైదరాబాద్, డిసెంబర్ 06 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలుకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేలా మంత్రి కేటీఆర్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2018 జూన్ 01 నాటికి అమీర్ పేట నుండి హైటెక్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మెట్రో సమీక్షా సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి రైళ్ళ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల వంటి ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో అవసరమైన పార్కింగ్ సౌకర్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.