కందులను మద్దతు ధరకు కొనేందుకు చర్యలు : హరీశ్‌రావు

SMTV Desk 2017-12-05 16:25:07  Marketing Minister Harishrao, Secretary Parthasarathy,

హైదరాబాద్, డిసెంబర్ 05 : కందుల పంటను మద్దతు ధరకు కొనే దిశగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం వ్యవసాయ మార్కెటింగ్ విభాగం కార్యదర్శి పార్థసారథి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కందులను 12 శాతం లోపు తేమ ఉండేలా అమ్మకానికి తీసుకురావాలని రైతులకు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ కందులను కొనేందుకు నోడల్‌ ఏజెన్సీలుగా హాకా, మార్క్‌ఫెడ్‌లను నియమించారు. అంతేకాకుండా అవసరమైన మేర 11 నుంచి 95 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌ రావు సూచించారు.