అరుదైన మైలురాయిని అందుకున్న "అపోలో"

SMTV Desk 2017-12-05 16:00:02  Apollo hospital, Mayomektami, robotic technology.

హైదరాబాద్‌‌, డిసెంబర్ 05 : అపోలో ఆసుపత్రి అరుదైన ఘనతను సాధించింది. రోబో సహాయంతో అతితక్కువ కోతతో వంద మయోమెక్టమి(గర్భాశయంలో కణితులను తొలగించే) శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రుల యాజమాన్యం మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ రూమాసిన్హా మాట్లాడుతూ.. రోబోలను ఉపయోగించి అతితక్కువ కోతతో వంద శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించి అరుదైన మైలురాయిని సాధించామని తెలిపారు. అలాగే అపోలో జేఎండీ డాక్టర్‌ సంగీతారెడ్డి, సీఈఓ వై.సుబ్రహ్మణ్యం ఈ రోబోటిక్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.