ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంపు

SMTV Desk 2017-12-05 15:39:57  Enhancing the age limit for job recruitment, amaravathi

అమరావతి, డిసెంబర్ 05 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకై వేచి చూస్తున్న యువతకు తీపికబురు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 2016లో పొడిగించిన వయోపరిమితి పెంపు గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియడంతో, వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ జీవోను ఈ నెల 3న జారీ చేసింది. అయితే, కొన్ని నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగుల విజ్ఞప్తికై పొడిగించడం జరిగింది. ఈ వయోపరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ), ఇతర నియామక సంస్థల ద్వారా నేరుగా జరిగే ఉద్యోగాల భర్తీకి మాత్రమే వర్తిస్తుంది.