విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల ర్యాలీ

SMTV Desk 2017-12-05 14:42:17  Role of electricity contract employees, vijayawada

విజయవాడ, డిసెంబర్ 05 : సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో విద్యుత్ ఒప్పంద ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి జింఖానా మైదానం వరకు జరిగిన ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో, ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న 24వేల మందిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.