దక్షిణకొరియాలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన

SMTV Desk 2017-12-05 13:47:08  dakshina koriya, ap cm chandrababu tour second day, busan meeting

అమరావతి, డిసెంబర్ 05 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణకొరియాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రెండో రోజు బుసాన్ లో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. అక్కడికి వచ్చిన ప్రముఖులకు కొరియా భాషలో అభినందనలు తెలిపి చంద్రబాబు ఆకట్టుకున్నారు. దక్షిణకొరియా తరహాలోనే తాము సంక్షోభంగా అవకాశం వెతుకొని అభివృద్ధి వైపు దూసుకేలుతున్నామని చెప్పారు. మానవవనరులు మేధా శక్తి ఉన్న తమ ప్రాంతాన్ని కొరియా తరువాత పెట్టుబడులకు రెండో ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని వాణిజ్యవేత్తలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయన వివరించారు. టెక్నోలజీ పరంగా ఎంతో ముందున్నామని పరిశ్రమల స్థాపన కోసం అన్ని విధాల సహకరిస్తామన్నారు.